Sree Viswavasu Nama Samvatsara Midhuna Rasi / Gemini Sign Free Telugu Rasi Phalalu
మిధునరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. వారసత్వ సంపద విషయాలలో లాభ పడతారు. వ్యక్తిగత జాతకంలో శని గ్రహ సంపూర్ణ బలం కలిగి ఉన్నవారు ప్రభుత్వ పరమైన లాభములను ఈ సంవత్సరం అధికంగా పొందుతారు. నిత్యం పూజాది క్రతువులు నిర్వహించే వారికి ఈ సంవత్సరం అంతా ఆచారం పాటించడానికి కావలసినటువంటి సమయం లభించదు. ఆచారం స్వల్పం అగును. సరిపడినంత సమయాన్ని దైవ ఆరాధనకు కేటాయించలేరు. మిధునరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
మిదునరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన అంత అనుకూల ఫలితాలు ఏర్పడవు. 18 మే 2025 వరకు కొంత అనుకూలంగానే ఉన్నప్పటికీ ఆ తదుపరి రాహువు వలన అనుకూల ఫలితాలు పొందలేరు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు, మాతా పితృ వర్గీయుల ఆరోగ్య సమస్యలు ఆందోళన కలుగచేస్తాయి. మిధున రాశి వారికి ఈ సంవత్సరం రాహు గ్రహ శాంతులు అవసరం.
మిధునరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా 19 మే 2025 నుండి భూ సంబంధ క్రయ విక్రయాలు లాభకరంగా ఉంటాయి. సొంత గృహ సౌఖ్యం ఏర్పాటు చేసుకోగలగుతారు. వ్యవసాయ ఆధారిత రంగం వారికి బాగా కలసి వస్తుంది. ఆశించిన విధంగా చేతి పై ధనం నిలువ ఉంటుంది.
ఏప్రిల్ 2025 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ప్రధమ వారంలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. తలపెట్టిన నూతన ప్రయత్నాలు తప్పక విజయవంతం అగును. వ్యాపార విస్తరణకు మిత్రులు కలిసి వస్తారు. అవసరమగు మూలధనం సమకుర్చూకొగలరు. ఉద్యోగ జీవనంలో మంచి ప్రోత్సాహకర సమయం ఏర్పడుతుంది. ధనాదాయం బాగుండును. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. 17, 18, 19 తేదీలలో గతకాలపు ఋణ బాధలు తొలగును. నూతన లక్ష్యాలను నిర్దేసించుకుంటారు. చివరి వారంలో సామజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ మాసంలో శుభ ఫలితాలు ఏర్పడును. వ్యక్తిగత జీవనంలో మానసిక సంతోషం, కోరుకున్న విధంగా తృప్తి లభించును.
మే 2025 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఆశించిన విధంగా నూతన జీవన యోగాలు ప్రారంభం అవుతాయి. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఉద్యోగ జీవనంలో ఆశించిన ఉన్నతి లేదా వేతన పెరుగుదల లభిస్తుంది. విద్యార్ధులకు చక్కటి సాంకేతిక విద్యలో ప్రవేశం లభించును. 9, 10, 11, 12 తేదీలలో వివాహ సంబంధ లేదా సంతాన సంబంధ శుభవార్తలు వింటారు. పరోపకారం వలన ఇతరుల మన్ననలు పొందుతారు. వృత్తి జీవనంలో కోరుకున్న గుర్తింపు లభిస్తుంది. నూతన స్నేహ సంబంధాల వలన కాలం ఉల్లాసంగా గడుస్తుంది. కుటుంబ సభ్యుల వినోద కార్యక్రమాలకై ధనం ఖర్చు అగును.
జూన్ 2025 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కుటుంబ వివాదాలు ఉన్నా ఆర్ధిక లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త. ఐటి రంగంలో పని చేస్తున్న వారికి నూతన ప్రాజెక్ట్లు లభిస్తాయి. నూతన అధికారాలు పొందుతారు. వాహన యోగం ఉన్నది. గృహంలో కుటుంబ సభ్యులతో సామరస్యంతో వ్యవహరించాలి. విదేశీ జీవన ప్రయత్నాలలో సమస్యలు ఎదురగును. తృతియ వారంలో వృధా ప్రయాణాలు చేస్తారు. సమయ పాలనలో విఫలమవుతారు. శారీరక శ్రమ వలన అశాంతి కలుగును. చివరి వారంలో మీ చేతిపై పుణ్యకార్యములు జరుగును. శుభ కార్యములకు ధనం వ్యయమగును. స్త్రీలకు స్థిరాస్తి సంబంధ లాభం ఏర్పడును. గురువుల ఆశీస్సులు లభించును. ఈ మాసంలో 2, 17, 23, 24 తేదీలలో పితృ వర్గీయులకు ఆరోగ్య సమస్యలు.
జూలై 2025 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో సువర్ణ లేదా అధునాతన పరికరాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగ జీవనం సామాన్య యోగాన్ని కలుగచేయును. ఆలోచనా విధానం బాగుండును. ఈ మాసంలో కూడా కుటుంబ సమస్యలు మానసికంగా చికాకులు కలుగచేయును. రక్త సంబంధీకుల పట్ల అభిమానం అవసరం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. సంతాన సంబంధిత విషయాలలో ప్రతికూల ఫలితాలు ఏర్పడును. ఈ మాసంలో 29, 30 తేదీలలో తలపెట్టు నూతన కార్యములు జయప్రదంగా కొనసాగుతాయి
ఆగష్టు 2025 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో అధికారుల వలన వేధింపులు, ఒత్తిడి పెరుగు సంఘటనలు. వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం తగ్గును. ముఖ్యంగా భాత్రు వర్గం వలన మానసిక అశాంతి ఎదురగును. కుటుంబ పరంగా భూ లేదా స్థల సంబంధమైన నష్టం ఏర్పడుటకు సూచనలు అధికం. నేత్ర సంబంధ సమస్యల వలన ఇబ్బందులున్నాయి. ఈ మాసంలో 13 నుండి 18 వ తేదీ మధ్య కాలంలో గౌరవం దెబ్బతినును. జీవన విధానంలో సమస్యలు ఎదురగును. 29, 30 తేదీలలో ఆరోగ్య సమస్యలు వలన ఖర్చులు అధికం అవుతాయి. నిరాశాజనక వాతావరణం ఎదురగును. మిత్రులకు సంబంధించి అశుభ వార్తలు వినవలసి వచ్చును.
సెప్టెంబర్ 2025 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా వ్యాపార వ్యవహరాదులలో ఆశించిన ఫలితాలు ఏర్పడుట కష్టం. ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు ఎదుర్కొందురు. తోటి ఉద్యోగుల వలన తీవ్ర ఇబ్బందులు అనుభవిస్తారు. ఆర్ధిక అపవాదులు ఎదుర్కొను సూచనలు అధికంగా ఉన్నవి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అతి కష్టంపై ఫలించును. వ్యాపార వ్యవహారములలో అననుకూల మార్పులు జరుగును. రసాయన సంబంధ వ్యాపారం చేయువారికి జీవనాధారం దెబ్బతింటుంది. లభించిన అవకాశములతో తృప్తి పడవలెను. నాయకులకు పదవీభంగం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం.
అక్టోబర్ 2025 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసం ప్రధమ వారంలో సంతాన సంబంధ లాభములు ఏర్పడును. బాగా ఎదిగిన సంతానానికి కోరుకొన్న విధంగా ఉద్యోగ లాభం ఏర్పడును. గత కాలపు సమస్యల నుండి కొంత ఉపశమనం లభించును. కుటుంబ సంబంధాలు కొంత బాగుండును. స్నేహ పూర్వకంగా మాట్లాడడం వలన ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆత్మీయుల వలన నూతన ప్రయత్నాలు లాభించును. విమర్శల నుండి బయట పడతారు. పెద్దల అనుభవం ఉపయోగపడుతుంది. ఫైనాన్సు వ్యాపారం చేయువారికి ఈ మాసం అంతగా కలసిరాదు. పెద్ద మొత్తంలో ధనాన్ని నష్టపోవుదురు. మాస ద్వితియార్ధంలో కోర్టు, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆశించిన గుర్తింపు పొందుతారు.
నవంబర్ 2025 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో నూతన భాద్యతలు చేపడతారు. వాటికి అనుగుణంగా మీ వ్యవహార శైలి మార్చుకొని వ్యవహరిస్తారు. ఇరుగుపొరుగు వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవన మార్గంలో ఆసక్తికర సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అధికం అవుతాయి. దూర ప్రయాణ సంబంధ ప్రణాళికలు సిద్ధం చేసుకొంటారు. వ్యాపార రంగాల్లో చక్కటి అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. దేవతా ప్రతిష్ట వంటి దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల విశ్వాసం సంపాదించుకొంటారు. మిత్ర వ్యాపార సంబంధ విషయాలలో నిర్ణయాలను వాయిదా వేయకుండా ఉండుట మంచిది. ఈ మాసంలో 13, 14 , 19, 25 తేదీలలో చేపట్టు నూతన ప్రయత్నాలు విజయవంతం అగును.
డిసెంబర్ 2025 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో సంతోషకరమైన వైవాహిక జీవన యోగములు ఉన్నవి. గృహంలో బంధువుల కలయిక, సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. మీ పైన కుటుంబ పెద్దలు పెట్టుకున్న ఆశలు నేరవేర్చగలరు. మొత్తం మీద ఈ మాసంలో ఆశించిన సుఖ సంతోషాలు పొందగలుగుతారు
జనవరి 2026 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధన - ధాన్య లాభములు ఉన్నవి. స్త్రీలకు మనో అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తికరమైన మార్గంలో కొనసాగును. ధనాదాయంలో పెరుగుదల ఉంటుంది. మంచి భవిష్యత్ కు పునాదులు వేసుకొంటారు. కుటుంబ కీర్తి వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. సంతాన విషయమై వైద్య సహాయం తీసుకొంటారు. ముఖ్య వ్యక్తులతో తలపెట్టిన చర్చలు ఫలప్రదమవుతాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గంభీరంగా వ్యవహరించాలి. చివరి వారంలో కోర్టు కేసులు కొట్టివేయబడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఫెబ్రవరి 2026 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఒక శస్త్రచికిత్స లేదా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకొనుట వంటి ఫలితాలు ఎదుర్కొంటారు. మాసం ప్రధమ అర్ధ భాగంలో గృహంలో ఒక ముఖ్య వస్తువు కనిపించకుండా పోవుట వలన ఆందోళన ఎదుర్కొంటారు. ఉద్యోగ జీవనంలో కార్యభారం పెరుగును. దూరప్రాంత ప్రయాణములు అనుకూలంగా ఉండవు. ప్రేమ వ్యవహారాలలో మనోవేదన ఎదురగును. తీవ్ర ప్రయాస అనంతరం కార్యములు విజయం పొందును. వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. ఆదాయంలో పెరుగుదల కొరకు నూతన మార్గములు అన్వేషిస్తారు. ఎదిగిన పుత్ర సంతనముతో కొద్దిపాటి అభిప్రాయ బేధాలు ఏర్పడును. ఉద్యోగ జీవన ఫలితాలు సామాన్యం. ఈ మాసంలో 1, 3, 4, 16, 27 తేదీలు అనుకూలమైనవి కావు.
మార్చ్ 2026 మిధునరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో పనులలో విఘ్నములు క్రమేపి తగ్గుముఖం పట్టును. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు, స్థిర నివాశ మార్పులకై చేయు ప్రయత్నాలు విజయవంతం అగును. తృతీయ వారంలో 13, 14, 15 తేదీలలో వాహన సంబంధ తగాదాలు ఎదురగుట వలన అశాంతి పొందుతారు. ఈ మాసంలో 18, 19, 20, 21 తేదీలలో నూతన ఉన్నత అవకాశములు లభించును. మాసాంతానికి గృహంలోకి నూతన వస్తువుల సమకుర్చుకొందురు. భూ సంబంధ క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి వలన సౌఖ్యం వంటి అనుకూల ఫలితాలు ఏర్పడును.